భక్తులకు ముఖ్య సూచనలు:
1. తేది.14-04-2019 ఉదయం 7 గంటల నుండి కళ్యాణ మండపం ప్రవేశ క్యూలైన్ లోనికి ప్రవేశము అనుమతించ బడును. ఉదయం 9 గం. లోగా కళ్యాణ మండపం వద్దకు విచ్చేయు ప్రార్థన. 2. ఉభయదాతలకు (రూ|| 5000/- టికెట్) ఇద్దరికి, 1బి సెక్టార్ ద్వారా కల్యాణోత్సవ ప్రవేశం, స్వామి వారి శేష వస్త్రం, కళ్యాణ అక్షింతలు, 500గ్రాముల మహా లడ్డు ప్రసాదం, సచిత్ర రామాయణం పుస్తకం, రామదాస కీర్తనల సి.డి, ఇద్దరికీ మూల విరాట్టుల దర్శనం మరియు అన్నప్రసాదం కూపన్ లు అందించ బడతాయి. 3. సూచించిన గేటు ద్వారా క్యూలో మీ సెక్టారు లోనికి ప్రవేశించ గలరు 4. శ్రీ స్వామి వారి ప్రసాదం చిన్న లడ్డు (100 గ్రాములు) ఒకటి రూ|| 20/- లకు మరియు పెద్ద లడ్డు (500 గ్రాములు) ఒకటి రూ|| 100/- ల చొప్పున దేవస్థానం ఏర్పాటు చేసిన కౌంటర్ లలో విక్రయించబడును. 5. భక్తులు పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ కవర్ లు ఎక్కడపడితే అక్కడ పడివేయకుండా నిర్దేశించిన ప్రాంతములయందు ఏర్పాటు చేసిన చెత్తకుండీలలో మాత్రమే పడవేయగలరు. పవిత్ర పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచగలరు 6. భక్తులు గోదావరి తీరమున స్నానము చేయునపుడు ప్రభుత్వము వారిచే ఏర్పాటు చేయబడిన బ్యారికేడింగ్ దాటి లోతుకి వెళ్ళరాదు 7. భక్తులు శ్రీ స్వామి వారి కళ్యాణ వేదిక వద్దకు వెళ్ళుటకు ప్రయత్నించరాదు 8. తమకు కేటాయించ బడిన నిర్ణీత సెక్టార్ నుండి మాత్రమే కూర్చొని శ్రీ స్వామి కళ్యాణం తిలకించవలయును 9. భక్తులు తమ తమ వస్తువులను, ఆభరణములను జాగ్రత్తగా దొంగల బారి నుండి కాపాడుకోవలెను 10. చిన్న పిల్లల జేబులో వారి చిరునామా తెలుపు పత్రమును ఉంచవలెను 11. తప్పిపోయిన పిల్లల గురించి మరియు అపహరించబడిన వస్తువుల గురించి వెంటనే పోలీసు కార్యాలయమునకు మరియు దేవాలయ కార్యాలయమునకు సమాచారం అందించవలెను 12. భక్తులు సమాచారం కొరకు స్వచ్చంద సంస్థలు, దేవస్థానం మరియు పోలీసు శాఖ సిబ్బంది సహకారం పొందగలరు |
||